కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నమూత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌(82) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నమూత
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2020 | 9:52 AM

Jaswant Singh passes Away: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌(82) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1938లో రాజస్థాన్‌లో జన్మించిన జశ్వంత్‌ సింగ్.. భారత సైన్యంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. రిటైర్మెంట్ తరువాత బీజేపీలో చేరిన ఆయన 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఐదుసార్లు రాజ్యసభ, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ హయంలో జశ్వంత్ సింగ్‌ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,967 కొత్త కేసులు.. 9 మరణాలు

Bigg Boss 4: అఖిల్‌ని దత్తత తీసుకుంటా: గంగవ్వ