కొరటాల వెబ్‌ సిరీస్‌లో టాలెంటెడ్ యంగ్ హీరో‌..!

| Edited By:

Oct 13, 2020 | 5:38 PM

ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అందులో విడుదల అవుతున్న వెబ్‌సిరీస్‌లపై ప్రేక్షకుల మనసు మళ్లుతుండటంతో

కొరటాల వెబ్‌ సిరీస్‌లో టాలెంటెడ్ యంగ్ హీరో‌..!
Follow us on

Koratala Siva News: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అందులో విడుదల అవుతున్న వెబ్‌సిరీస్‌లపై ప్రేక్షకుల మనసు మళ్లుతుండటంతో వాటిని తెరకెక్కించేందుకు ఓటీటీ నిర్వాహకులు మరిన్ని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ భాషల్లోనూ వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు తెలుగులోనూ వెబ్‌సిరీస్‌లు చేసేందుకు పలువురు దర్శకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ దర్శకుడు కొరటాల శివ సైతం ఓ వెబ్‌సిరీస్‌కి కథను రాశారట.

అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ రానుందట. ఇక ఆ కథకు కొరటాల అసిస్టెంట్‌ దర్శకత్వం వహించనున్నారట. కాగా ఈ వెబ్‌సిరీస్‌లో టాలెంటెడ్‌ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ కోసం ఆ నటుడు డేట్లు కూడా ఇచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి హీరోగా ఆచార్యను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాత అల్లు అర్జున్‌తో ఓ మూవీని తెరకెక్కించనున్నారు. మరోవైపు నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలులో నటిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్‌లోనూ నటించబోతున్నట్లు సమాచారం.

Read More:

ఆసుపత్రి నుంచి నటుడు డిశ్చార్జి.. పిల్లల ‘వెల్‌కమ్’‌ పోస్ట్‌ వైరల్‌‌

ఎంగేజ్‌మెంట్‌ ఫొటో షేర్ చేసిన గౌతమ్‌.. కాజల్‌ రిప్లై