వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్న ‘గాలి సంపత్’.. కొత్త సినిమా టైటిల్‏ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో..

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఈ హీరో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు.

వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్న గాలి సంపత్.. కొత్త సినిమా టైటిల్‏ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో..

Updated on: Feb 16, 2021 | 8:19 PM

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఈ హీరో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు. అటు గాలి సంపత్ సెట్స్ పై ఉండగానే.. మరో ప్రాజెక్ట్‏ను స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. బాణం ఫేం చైతన్య దంతులూరి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ‘భళా తందనాన’ అనే టైటిల్‏ను ఖరారు చేశారు. ఈ సినిమాను మంగళవారం గ్రాండ్‏గా లాంఛ్ చేశారు.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా.. దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వల్లి, రమ చిత్రబందానికి స్క్రిప్టుని అందజేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో కేథరిన్ థెరిసా హీరోయిన్‏గా నటిస్తోంది. కేజీఎఫ్ ఫేం రామ‌చంద్ర‌రాజు విల‌న్ గా న‌టిస్తున్నాడు. మ‌ణిశర్మ బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు.

Also Read:

Panja Vaishnav Tej : అక్కినేని వారి బ్యానర్ లో మెగాహీరో మూడవ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా..?