టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్‌చరణ్.. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు.. వేగంగా కొనసాగుతున్నాయి. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు బుచ్చి బాబు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఉంటుందని ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసందే. శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత బూచ్చిబాబుతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు బుచ్చి బాబు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి.. తాజాగా టాలీవుడ్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనుందని టాక్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ చాలా కాలంగా టాలీవుడ్ లో సినిమా చేయాలని చూస్తోంది. మొన్నామధ్య తారక్ తో సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చరణ్ కు జోడీగా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా కూడా బుచ్చి బాబు స్టైల్ లో లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని అంటున్నారు,. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని క్రేజీ ఆప్డేట్ అందివ్వనున్నారు. ఈ సినిమా ను మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..