సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌తో ఉండబోతుందని సోమవారం ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మంగళవారం చెబుతానంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. దీంతో ఎప్పటిలాగే వర్మ ఏదో సంచలనానికి సిద్ధమయ్యాడనుకొన్న నెటిజన్లు.. ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇదంతా తూచ్ అని చెప్పేసిన వర్మ.. తాను ఈ మూవీని చేయాలనుకోవడం లేదంటూ అందరికీ షాక్‌ను ఇచ్చాడు. అంతేకాదు దానికి ఓ నిర్వచనం కూడా ఇచ్చాడు.
At 9.36 Am tmrw 29th I am going to announce the details of my next film after KAMMA RAJYAMLO KADAPA REDDLU ..The title of my next film is MEGA FAMILY
— Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2019
‘‘మెగా ఫ్యామిలీ అనే చిత్రం ఒక వ్యక్తి, అతడికి చెందిన 39మంది సంతానంకు సంబంధించినది. ఇందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ నేను చిన్న పిల్లల చిత్రాలను తీయలేను. అందుకే ఈ సినిమాను తీయడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అందరూ ఉఫ్ అనుకున్నారు.
MEGA FAMILY is about a man who has 39 children but since there are too many children and I am not good in making children’s films,I decided not to make it
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2019
అయితే సోమవారం మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌ను వర్మ ప్రకటించగానే.. మెగా ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ పెరిగింది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, వర్మను దారుణంగా ట్రోల్ చేశారు. అంతేకాదు కొంతమంది బెదిరింపులు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన వెనక్కు తగ్గాడని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వర్మ ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీయగా.. వాటిపై పెద్ద పెద్ద వివాదాలే జరిగాయి. కానీ ఎన్ని వివాదాలు వచ్చినా.. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. వర్మ అంత ఈజీగా వెనక్కి తగ్గడు. అలాంటిది ఇప్పుడు మాత్రం వర్మ అంత ఈజీగా అతడు వెనక్కి తగ్గడానికి గల కారణాలేంటో ఆయనే తెలియాలి మరి. కాగా ఏపీ రాజకీయాలపై ఆయన తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ ఇటీవల విడుదల అవ్వగా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.