మిస్ వరల్డ్‌ను బరువు తగ్గాలన్న రచయిత.. ఎందుకో తెలిస్తే షాకవుతారు?

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు తాము పోషించే పాత్రల కోసం బరువు పెంచడం, తగ్గడం మామూలే. ఆమిర్ ఖాన్ ‘గజిని’ కోసం సిక్స్​ ప్యాక్ బిల్డ్ చేశాడు, ‘దంగల్’ కోసం 30 కేజీలు పెంచి తర్వాత మళ్లీ తగ్గాడు. భూమి పెడ్నేకర్ ‘దుమ్ లగాకే హైషా’ కోసం ..

మిస్ వరల్డ్‌ను బరువు తగ్గాలన్న రచయిత.. ఎందుకో తెలిస్తే షాకవుతారు?
Vairamuthu

Updated on: Nov 27, 2025 | 6:35 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు తాము పోషించే పాత్రల కోసం బరువు పెంచడం, తగ్గడం మామూలే. ఆమిర్ ఖాన్ ‘గజిని’ కోసం సిక్స్​ ప్యాక్ బిల్డ్ చేశాడు, ‘దంగల్’ కోసం 30 కేజీలు పెంచి తర్వాత మళ్లీ తగ్గాడు. భూమి పెడ్నేకర్ ‘దుమ్ లగాకే హైషా’ కోసం 30 కేజీలు పెంచి, ‘బాలా’ కోసం తగ్గింది.

విద్యా బాలన్, రవీనా టండన్, సోనమ్​ కపూర్, అనుష్క శెట్టి, ప్రభాస్​, రానా… ఇలా ఎంతోమంది నటీనటులు ఆయా సినిమాల్లో తమ పాత్రలకు అనుగుణంగా తమ శరీరాన్ని టూల్‌గా మార్చుకున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు ఓ స్టార్ హీరోయిన్‌ను ‘2 కేజీలు తగ్గండి’ అని సూచించారట. ఎవరా హీరోయిన్? ఎందుకు అడిగారు?

1998లో డైరెక్టర్​ శంకర్ దర్శకత్వంలో​ వచ్చిన ‘జీన్స్’ సినిమా ఇప్పటికీ ఒక అందరికీ గుర్తిండిపోయిన సినిమా. ఆ సినిమా షూటింగ్ టైంలో ఐశ్వర్య రాయ్ బరువు 52 కేజీలు అని చెప్పిందట. ఆ సమయంలో ఒక ఈవెంట్‌లో వైరముత్తు ఆమెతో ‘నా మాట తప్పకూడదు కదా… 2 కేజీలు తగ్గండి’ అని సరదాగా అన్నారట. ఎందుకంటే, ఆ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘హైర హైర హైరబ్బా..’లో చరణంలో ‘50 కేజీ తాజ్‌మహల్…’ అనే లైన్​ వస్తుంది.

‘50 కేజీల తాజ్‌మహల్’ లైన్​కి సరిపోయేలా ఉంటే బాగుంటుంది. హీరోయిన్ 52 కేజీలు ఉంటే ఎలా? అని జోక్ చేశారట. ఐశ్వర్య కూడా ఆయన మాటల్ని సరదాగా తీసుకుందట. తాజాగా ఈ విషయాన్ని నటి కస్తూరి ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. దాంతో ఆ వీడియో సోషల్​మీడియాలో మరోసారి వైరల్​ అయ్యింది.

Jeans

25 ఏళ్ల తర్వాత వార్తల్లో నిలిచిన వీడియో గురించి కస్తూరి మాట్లాడుతూ.. ‘కొందరు బాడీ షేమింగ్ అనుకుంటున్నారు, కొందరు ఫన్నీ జోక్ అంటున్నారు. నిజానికి ఇది పాటలోని లిరిక్‌తో లింక్ చేసిన క్రియేటివ్ ఫన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చింది. సినిమా ప్రపంచంలో ఇలాంటి చిన్న చిన్న జోక్స్, టీజింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. నటీనటులు వీటిని సీరియస్‌గా తీసుకోరు.

ఐశ్వర్య కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు. బ్యూటీ పేజెంట్ విన్నర్‌గా తన కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగింది. ఆ తర్వాత ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’, ‘పొన్నియిన్ సెల్వన్’లో కూడా ఆమె గ్లామర్, గ్రేస్ మారలేదు. అందుకే సినిమాల్లో బరువు పెరగడం, తగ్గడం పాత్రల కోసం సాధారణం అయినా, ఆర్టిస్ట్ ఆత్మ విశ్వాసం మాత్రమే ముఖ్యం. వైరముత్తు జోక్ ఇప్పుడు మళ్లీ ‘జీన్స్’ పాటలను గుర్తుచేసి, 90ల నాస్టాల్జియాను రిఫ్రెష్ చేస్తోంది!