Waltair Veerayya Release Live: థియేటర్లలో పూనకాలు లోడింగ్‌.. కుమ్మేస్తున్న వాల్తేరు వీరయ్య.

Waltair Veerayya Live Updates: సంక్రాంతి పండుగను మరింత రెట్టింపు చేస్తూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది వాల్తేరు వీరయ్య మూవీ. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ హంగామా..

Waltair Veerayya Release Live: థియేటర్లలో పూనకాలు లోడింగ్‌.. కుమ్మేస్తున్న వాల్తేరు వీరయ్య.
Waltair Veerayya

Edited By:

Updated on: Jan 13, 2023 | 12:08 PM

Waltair Veerayya Live Updates: సంక్రాంతి పండుగను మరింత రెట్టింపు చేస్తూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది వాల్తేరు వీరయ్య మూవీ. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఉదయం నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరు. ఈ సినిమాలో చిరు సరసన శృతీ హాసన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. అమెరికాలో ప్రీమియర్స్‌ అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.

అమెరాకతో పాటు, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్‌లో మెగా ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. మెగా స్టార్‌ అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. థియేటర్ల వద్ద బాణా సంచాలు కాలుస్తూ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ థియేటర్‌ వద్ద మెగాస్టార్‌ భారీ హోర్డింగ్‌లతో సందడి చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jan 2023 11:53 AM (IST)

    వాల్తేరు వీరయ్య థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ..

     

  • 13 Jan 2023 11:31 AM (IST)

    మెగా ఫ్యాన్స్ రచ్చ..


  • 13 Jan 2023 11:06 AM (IST)

    వాల్తేరు వీరయ్య మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్

    – వాల్తేరు వీరయ్య మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్

    – ఫస్ట్ డే ఫస్ట్ షోను చూసి సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    – స్టోరీ, మ్యూజిక్, డాన్స్, ఫైట్స్ సూపర్ హిట్ అంటున్న వీక్షకులు

    – మెగాస్టార్ మరోసారి దుమ్ము లేపాడంటున్న అభిమానులు.. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ సందడి

    – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ కూడా అదిరింది అంటున్న ఫ్యాన్స్

  • 13 Jan 2023 10:14 AM (IST)

    ఆస్ట్రేలియాలో మెగా ఫ్యాన్స్ సందడి..

    ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అక్కడి థియేటర్లలో మెగా ఫ్యాన్స్ నినాదాలతో దద్దరిల్లిపోయింది.  ఆస్ట్రేలియాలోని ఐమాక్స్ లో స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ స్లోగన్స్ తో హోరెత్తించారు.

  • 13 Jan 2023 08:55 AM (IST)

    వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్

    – వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్

    – ఫస్ట్ హాఫ్ లోనే చిరంజీవి అదరగొట్టాడు అంటున్న అభిమానులు

    – థియేటర్లలో స్టెప్పులతో అభిమానుల సందడి… మూవీ సాంగ్స్ చూస్తూ డాన్స్ లు

    – పూనకాలు లోడింగ్ అంటున్న మహిళలు, అభిమానులు

    – ఫస్ట్ హాఫ్ తర్వాత సంఘం శరత్ థియేటర్ లో అభిమానుల సందడి

    – డైలాగ్స్ చెబుతూ స్టెప్పులు వేస్తూ హడావిడి

  • 13 Jan 2023 08:33 AM (IST)

    విశాఖలోని వాల్తేర్ వీరయ్య ఫీవర్

    – విశాఖలోని వాల్తేర్ వీరయ్య ఫీవర్

    – థియేటర్లని హౌస్ ఫుల్

    – థియేటర్ల వద్ద ఫాన్స్ సందడి

    – తొలిరోజు తొలిసూచేందుకు ఎగబడుతున్న మెగా అభిమానులు

  • 13 Jan 2023 08:20 AM (IST)

    విజయవాడలో మెగాస్టార్ అభిమానుల హంగామా..

    • విజయవాడ లో రిలీజ్ అయిన అన్ని థియేటర్లో మెగా స్టార్ అభిమానుల హంగామా
    • సినిమా హిట్ టాక్ రావడంతో టికెట్ల కోసం ఎగబడుతున్న జనం
    • పాలాభిషేకాలు బాణాసంచా కాల్చి అభిమానాన్ని ప్రదర్శిస్తున్న ఫ్యాన్స్
    • అప్సర థియేటర్ వద్ద వాల్తేరు వీరయ్య కోలాహలం
  • 13 Jan 2023 08:13 AM (IST)

    సాంకేతిక లోపాల వల్ల ఆగిన బెనిఫిట్ షో.. ఫ్యాన్స్ ఫైర్..

    గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీలక్ష్మీ థియేటర్లో వాల్తేరు వీరయ్య సినిమా

    ఉదయం ఆరు గంటలకి బెనిఫిట్ షో ప్రదర్శించాల్సిన సినిమా

    ప్రదర్శన లో సాంకేతిక లోపాల వల్ల ఆగిపోవడంతో

    అభిమానులు ఆగ్రహానికి గురై థియేటర్ అద్దాలు పగలగొట్టి ఆందోళన

    పోలీసులు రంగ ప్రవేశంతో శాంతించిన అభిమానులు

  • 13 Jan 2023 08:07 AM (IST)

    మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్..

    సినిమా సూపర్ హిట్ అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

  • 13 Jan 2023 07:40 AM (IST)

    ఫ్యాన్స్‌కు పూనకాలే..

    వాల్తేరు వీరయ్య సినిమా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చే మాస్ ఎంటర్టైనర్ అని చిరు అభిమానులు అంటున్నారు. ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

  • 13 Jan 2023 06:30 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 1200కు పైగా..

    వాల్తేరు వీరయ్య మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 1200కుపైగా థియేటర్లలో విడుదలైంది. దీంతో అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. బెనిఫిట్‌ షోలకు ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

  • 13 Jan 2023 06:24 AM (IST)

    వాల్తేరు చిత్ర యూనిట్ సందడి.

    వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఉదయం 4 గంటలకే సినిమా వీక్షించారు. హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో స్పెషల్‌ షోలో సినిమాను వీక్షించారు. దర్శకుడు బాబీతో పాటు, దేవీశ్రీ ప్రసాద్‌, చిరంజీవి కుమార్తెలు సినిమాను వీక్షించారు.