క్యాన్సర్‌ బారిన పడి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు.. అభిమానులు షాక్‌

తమిళంలో పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించిన తవసి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ బారిన పడగా

క్యాన్సర్‌ బారిన పడి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు.. అభిమానులు షాక్‌

Edited By:

Updated on: Nov 17, 2020 | 10:25 AM

Tamil Comedian Thavasi: తమిళంలో పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించిన తవసి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ బారిన పడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చాలా సన్నబడిపోయారు. మరోవైపు ఆర్థికంగానూ ఇబ్బందులు రావడంతో.. తమ తండ్రిని ఆదుకోవాలంటూ తమసి కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు. ఈ క్రమంలో నడిగర్ సంఘం కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. కాగా ఒకప్పుడు తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించిన ఈ నటుడి పరిస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

అపర భగీరథుడు వైఎస్ జగన్‌.. సీఎంపై నారాయణ మూర్తి ప్రశంసలు

నాని-నజ్రియా మూవీకి టైటిల్‌ ఫిక్స్‌.. భలే ఇంట్రస్టింగ్‌గా ఉందే..!