టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఇటీవల `హిట్` చిత్రంలో మంచి కమర్షియల్ హిట్‌ను సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. దీంతోపాటు ఈ మూవీని ఏప్రిల్ 30న థియేటర్లలోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. మ్యాజికల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
తాజాగా విడుదలైన పోస్టర్లో విశ్వక్ సేన్ కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలాగే మూవీ పోస్టర్ కూడా ఆహ్లదకరంగా చుట్టూ.. లైట్ పింక్ గులాబీ పువ్వులతో క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
Also Read:
విశాల్ కూడా రంగంలోకి వచ్చేశాడు.. ‘చక్ర’ మూవీ రిలీజ్ డే అనౌన్స్ చేసిన టాలెంటెడ్ హీరో..