villain Becomes Hero: సీను తారుమారైందే… విలన్‌ హీరో అయ్యాడు.. హీరో విలన్‌గా మారాడు…

SonuSood Become Hero: లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతో మందికి అన్నీతానై అండగా నిలిచాడు నటుడు సోనూసూద్‌. విమానాలు, రైళ్లు, ప్రత్యేక బస్సులు ఇలా ప్రయాణ ఏర్పాట్లు చేసి.. వలస కూలీలను...

villain Becomes Hero: సీను తారుమారైందే... విలన్‌ హీరో అయ్యాడు.. హీరో విలన్‌గా మారాడు...

Updated on: Jan 31, 2021 | 3:30 PM

SonuSood Become Hero: లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతో మందికి అన్నీతానై అండగా నిలిచాడు నటుడు సోనూసూద్‌. విమానాలు, రైళ్లు, ప్రత్యేక బస్సులు ఇలా ప్రయాణ ఏర్పాట్లు చేసి.. వలస కూలీలను తమ సొంతుళ్లకు చేరుకోవడంలో సోనూ ముఖ్యపాత్ర పోషించాడు. అంతటితో ఆగకుండా.. ట్విట్టర్‌ వేదికగా సాయం చేయమని తనను వేడుకున్న వారికి ఆర్థికంగా సహాయం చేశాడు.


ఇలా.. రీల్‌ లైఫ్‌లో విలన్‌గా నటించిన సోనూసూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా పేరుతెచ్చుకున్నాడు. దీంతో సోనూసూద్‌ను విలన్‌గా చూపించడానికి కూడా దర్శకులు దడుచుకునే పరిస్థితుల వచ్చాయి. ఇక సోనూను హీరోగా చూపించడానికి దర్శకనిర్మాతలు కూడా ముందుకువచ్చారు. ఈ క్రమంలోనే సోనూ సూద్‌ హీరోగా నటిస్తూ సినిమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ‘కిసాన్‌’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు సోనూ ప్రకటించాడు కూడా. ఇదిలా ఉంటే తాజాగా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో సోనూసూద్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే.. ‘ఇరంబుదురై’ చిత్రంలో హీరోగా నటించిన విశాల్‌ హిందీ రీమేక్‌లో విలన్‌గా నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ లెక్కన చూస్తే.. హీరో విలన్‌గా మారాడు, విలన్‌ హీరోగా మారాడన్నమాట. మరి రియల్‌ లైఫ్‌లో హీరోగా మారిన సోనూ.. రీల్‌ లైఫ్‌లో హీరోగా ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.

Also Read: Rashi Khanna: రాశీఖన్నా మోటివేషనల్‌ స్పీచ్‌.. చాలా పెద్ద మాటలే చెప్పేసింది.. మీరే చూడండి