Vikram movie: థియేటర్లలో 100 రోజులు పూర్తిచేసుకున్న విక్రమ్ మూవీ..
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన చిత్రం 'విక్రమ్'. 'ఖైదీ' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో100 డేస్ ముగించుకొంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కమల్ హాసన్ కెరీర్‌లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది విక్రమ్. కమల్ నటించిన దశావతారం, విశ్వరూపం తర్వాత రూ. 100 కోట్ల గ్రాసర్ సాధించిన జాబితాలో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో 100 డేస్ ముగించుకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Published on: Sep 12, 2022 04:33 PM