Vijaya Raghavan Teaser: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘విజయ రాఘవన్‌’.. అదర గొడుతున్న సినిమా టీజర్..

|

Jan 03, 2021 | 8:36 AM

Vijaya Raghavan Teaser: విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమా ద్వారా తమిళ్, తెలుగు

Vijaya Raghavan Teaser: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘విజయ రాఘవన్‌’.. అదర గొడుతున్న సినిమా టీజర్..
Follow us on

Vijaya Raghavan Teaser: విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమా ద్వారా తమిళ్, తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేశాడు. మదర్ సెంటిమెంట్‌తో పలువురి మనసులను కదిలించాడు. విజయ్ ఏ సినిమా చేపట్టినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.

ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇందులో హీరోయిన్‌గా ఆత్మిక నటిస్తోంది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని యాక్షన్ సన్నివేశంలో కనిపిస్తారు. చిరుతపులి లాంటి కళ్లతో రౌడీ వైపు సీరియస్‌గా చూస్తున్న టీజర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. విజయ్‌ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్‌.ఎస్‌. ఉదయ్‌ కుమార్, సహ నిర్మాతలు: కమల్‌ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్‌ బోరా, ఎస్‌. విక్రమ్‌ కుమార్‌‌లు వ్యవహరించారు. కాగా ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు సినిమా కోసం ఆత్రుత కోసం ఎదురుచూస్తున్నారు.