ఆ తమిళ నటుడి హిందీ సినిమా షూటింగ్ షురూ.. మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ప్రాజెక్ట్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
Vijay Sethupathis: తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి చెప్పనక్కరలేదు. వైవిధ్య భరితమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు

Vijay Sethupathis: తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి చెప్పనక్కరలేదు. వైవిధ్య భరితమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఇప్పుడు హిందీలో మొదటి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విజయ్ విలన్‌గా నటించి అందిరిని మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకుడిగా మారి చేస్తున్న చిత్రం ‘ముంబైకర్’. ఇది పూర్తిగా హిందీ చిత్రం. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో విక్రాంత్ మెస్సేయ్ మరొక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే విజయ్ సేతుపతికి ఇదే మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ హిందీ ప్రాజెక్ట్. ఈ సినిమాలో ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఈ సినిమా మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేస్తున్నారు. అవును డీవోపీ కమ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఒకే ఒక్క షెడ్యూల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. జనవరి 10న మొదలైన ఈ షెడ్యూల్ నిరాటంకంగా జరుగుతోంది. ఫిబ్రవరి 27కు టాకీ పార్ట్ మొత్తం ముగుస్తుంది. ఎక్కువగా రాత్రి సమయాల్లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రఫీలో సంతోష్ శివన్ మ్యాజిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నైట్ ఎఫెక్ట్ అంటే ఇంకా అందంగా ఉంటాయి సన్నివేశాలు. శిబు తమీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మే 27న రిలీజ్ చేయనున్నారు.



