
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకున్నాయి. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఏందయ్య సామీ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి డైరెక్టర్ రాహుల్ క్రేజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టినట్లు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
తన సినిమా టీమ్ మొత్తాన్ని ఒక్కచోటికి చేర్చి “అలుపెరుగని సైన్యం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు డైరెక్టర్ రాహుల్. భారీ అంచనాల మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 16న దసరా కానుకగా అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల తర్వాత విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న సినిమా ఇది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
ఇందులో రష్మిక పాత్రకు జయమ్మ అని తన తల్లి పేరు పెట్టుకున్నట్లు ఇటీవల డైరెక్టర్ రాహుల్ తెలిపారు. “రణబాలి గుండెల్లో ప్రేమగా, ఆత్మలో స్పూర్తిగా, వెన్నెముకలో ధైర్యంగా, అతని పిచ్చిలో మాధుర్యంగా జయమ్మ పాత్ర ఉంటుంది” అని అన్నారు. ఈ సినిమాను 19వ శతాబ్దం నేపథ్యంలో 1854-1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
And thats a wrap to the 130 days of madness with my relentless and restless army. @RanabaaliFilm @MythriOfficial @TheDeverakonda @iamRashmika https://t.co/nBjT2lAHKw
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) September 17, 2026
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..