Vijaya Devarakonda: అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయదేవరకొండ. అయితే ఈ టాలీవుడ్ హీరో విజయదేవరకొండ మరో సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు ఫీల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు విజయ్. పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. కరోనా సంక్షోభం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాకుండా నిన్నుకోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పారట. ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. వచ్చే సంవత్సరం వేసవి కాలంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.