తెలుగు ‘గల్లీ బాయ్’గా విజయ్ దేవరకొండ..?

రణ్​వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్​ సినిమా ‘గల్లీబాయ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇక దీన్ని తెలుగులో రీమేక్​ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తాడని మొదట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ దానిలో నటించే ఆసక్తి లేదని సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ లో హీరో పాత్రకు విజయ్ దేవరకొండ సరిపోతాడని నిర్మాతలు భావిస్తున్నారట. ఇంకా దీనిపై అధికారక […]

తెలుగు గల్లీ బాయ్గా విజయ్ దేవరకొండ..?

Updated on: Apr 13, 2019 | 3:15 PM

రణ్​వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్​ సినిమా ‘గల్లీబాయ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇక దీన్ని తెలుగులో రీమేక్​ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తాడని మొదట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ దానిలో నటించే ఆసక్తి లేదని సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ లో హీరో పాత్రకు విజయ్ దేవరకొండ సరిపోతాడని నిర్మాతలు భావిస్తున్నారట. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్​. ఈ చిత్రంతో పాటు విజయ్, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడాఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.