Nayanthara: ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న కొత్త జంట.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న నయన్‌, విఘ్నేష్‌ రొమాంటిక్‌ పిక్స్‌.. 

|

Aug 12, 2022 | 5:42 PM

Nayanthara: కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లు జూన్‌ 09, 2022న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి వివాహానికి ముందు ఎన్నో పుకార్లు, మరెన్నో వదంతలు వచ్చినా వాటన్నింటికీ చెక్‌ పెడుతూ...

Nayanthara: ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న కొత్త జంట.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న నయన్‌, విఘ్నేష్‌ రొమాంటిక్‌ పిక్స్‌.. 
Follow us on

 

Nayanthara: కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లు జూన్‌ 09, 2022న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి వివాహానికి ముందు ఎన్నో పుకార్లు, మరెన్నో వదంతలు వచ్చినా వాటన్నింటికీ చెక్‌ పెడుతూ ఈ జంట అగ్ని సాక్షిగా ఏకమయ్యారు. ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకాగా అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక వివాహం అయిన నాటి నుంచి ఈ కొత్త జంట సరదగా గడుపుతోంది. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే రెక్కలు కట్టుకొని పక్షుల్లా విహరిస్తున్నారు.

ఇప్పటికే హనీమూన్‌ కోసం థాయిలాండ్‌, బ్యాంకాక్‌ వెళ్లిన నయన్‌, విఘ్నేష్‌ దంపతులు తాజాగా మళ్లీ విహారయాత్రకు బయలుదేరారు. తాజాగా ఈ విషయన్‌ విఘ్నేష్‌ స్వయంగా పంచుకున్నారు. ఏకాంతంగా గడపడానికి స్పెయిన్‌లోని బార్సిలోనా పట్టణానికి పయనమయ్యారు. విఘ్నేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తుంటే వీరు లగ్జరీ ఫ్లైట్‌లో వెళుతున్నట్లు అర్థమవుతోంది. ఇక నయనత తార హత్తుకున్న సమయంలో విఘ్నేష్‌ తీసిన సెల్ఫీ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా వైఫ్‌తో బార్సిలోనా వెళ్తున్నాను’ అని రాసుకొచ్చాడు.

మరో ఫొటోలో నయన చేతికి ముద్దిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎడతెరపి లేని పని తర్వాత మా కోసం మేం కొంత సమయాన్ని కేటాయించాం. బార్సిలోనా మేం వచ్చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేష్‌. దీంతో ఈ క్యూట్ కపుల్ రొమాంటిక్‌ ఫొటోలు కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..