Venkatesh Narappa: వేస‌విలో వ‌స్తానంటున్నవిక్ట‌రీ వెంక‌టేశ్‌… నార‌ప్ప విడుద‌ల తేదీ ఎప్పుడంటే..?

తమిళ అసురన్‌ సినిమాను తెలుగులో వెంక‌టేశ్ హీరోగా నారప్ప పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు...

Venkatesh Narappa: వేస‌విలో వ‌స్తానంటున్నవిక్ట‌రీ వెంక‌టేశ్‌... నార‌ప్ప విడుద‌ల తేదీ ఎప్పుడంటే..?

Edited By:

Updated on: Jan 29, 2021 | 5:48 PM

తమిళ అసురన్‌ సినిమాను తెలుగులో వెంక‌టేశ్ హీరోగా నారప్ప పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా… శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘నారప్ప’ విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మే14న ‘నారప్ప’ను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. అయితే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ… సినిమా యూనిట్ రెండు కొత్త పోస్టర్లను విడుద‌ల చేసింది. తమిళ అసురన్‌ను మరిపించేలా తెలుగులో నారప్పను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. గతంలో షూట్‌ చేసిన కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడంతో ఇటీవల వాటిని రీషూట్‌ చేసినట్లు సమాచారం. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, ప్రకాశ్‌ రాజ్‌, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు.