‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపాలంటూ టీడీపీ నేత ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మూవీ విడుదలపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. సినిమా విడుదలపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి తనకు సానుకూలత వస్తుందని భావిస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు
విడుదలకు ఒక వారం ముందుగా అంటే ఈ నెల 15న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్ షో వేయించాలని వర్మ భావిస్తున్నాడట. పలువురు సెలబ్రిటీలకు, మీడియా వారికి ఈ మూవీ ప్రీమియర్ షోను చూపించాలని వర్మ అనుకుంటున్నారట. సినిమా విడుదలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారికి వార్నింగ్‌గా వర్మ ఇలా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘తనను చంపినా, లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్‌లో విడుదల అవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.