Vakeel Saab : వైరల్ అవుతున్న’వకీల్ సాబ్’ ఫోటోలు.. సంబరపడుతున్న అభిమానులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. కటౌట్స్ ఈలలు గోలలు రచ్చరచ్చ గా ఉంటుంది. ఇక పవన్ సినిమానుంచి పోస్టర్ రిలీజ్ అయ్యిందంటే..

Vakeel Saab : వైరల్ అవుతున్నవకీల్ సాబ్ ఫోటోలు.. సంబరపడుతున్న అభిమానులు

Updated on: Jan 07, 2021 | 12:27 PM

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. కటౌట్స్, ఈలలు, గోలలు రచ్చరచ్చ గా ఉంటుంది. ఇక పవన్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యిందంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే.. తాజాగా పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవర్ స్టార్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటి చక్కర్లు కొడుతుంది. ప్ర‌ముఖ న‌టుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే  ఫైట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు పవన్ తో దిగిన ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇది కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ అయింది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Green India challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన బాలీవుడ్ స్టార్ హీరో..

Ram Gopal Varma’s 12 ‘O’ Clock : పొంగల్ బరిలో వర్మ కూడా.. అసలైన పండుగ ’12 O’Clock’ తోనే అట