వీడెంత క్యూట్..సానియా కొడుకుతో సరదాగా ఉపాసన

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. ప్రముఖ ఇండియన్ టెన్నిస్ ఫ్లేయర్ సానియా మీర్జా  కొడుకు ఇజాన్‌తో సరదాగా గడిపారు. భారత్, పాక్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఉపాసన లండన్ వెళ్లారు. ఇటీవల మ్యాచ్‌ల్లో భారత్‌కు ఛీర్స్ కొడుతూ గ్యాలరీల్లో సందడి చేశారు. ఇక ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతోన్న పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. అందుకే ఆమె మ్యాచ్‌లను తిలకించేందుకు గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. […]

వీడెంత క్యూట్..సానియా కొడుకుతో సరదాగా ఉపాసన

Updated on: Jun 24, 2019 | 5:49 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. ప్రముఖ ఇండియన్ టెన్నిస్ ఫ్లేయర్ సానియా మీర్జా  కొడుకు ఇజాన్‌తో సరదాగా గడిపారు. భారత్, పాక్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఉపాసన లండన్ వెళ్లారు. ఇటీవల మ్యాచ్‌ల్లో భారత్‌కు ఛీర్స్ కొడుతూ గ్యాలరీల్లో సందడి చేశారు. ఇక ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతోన్న పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. అందుకే ఆమె మ్యాచ్‌లను తిలకించేందుకు గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. దీంతో వీరందరూ ఒకేచోట తారసపడటంతో ఎంజాయ్‌మెంట్‌కి హద్దు లేకుండా పోయింది. ఈ సందర్భంగా సానియా కొడుకుతో ఉపాసన సరదాగా గడిపారు. ముద్దు చేస్తూ లండన్ వీధులన్నీ తిప్పారు. ఈ ఫొటోలను తాజాగా ఆమె ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఈ ఫొటోల్లో సానియా మీర్జా, ఆమె సోదరి అనం మీర్జా, సోదరి భర్త  కూడా ఉన్నారు.