ప్రేక్షకులకు డబుల్ డోస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఢీ సీక్వెల్ టీం.. ఇందులో విష్ణు సరసన ఇద్దరు హీరోయిన్‌లు?
హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇదే కాంబినేషన్
హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇదే కాంబినేషన్ సుధీర్ఘ విరామం తర్వాత మరోసారి వస్తోంది. ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డి & డి’ టైటిల్‌తో సినిమా చేయడానికి వారు రెడీ అవుతున్నారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
విష్ణుకు జోడీగా ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ నటించనున్నారని తెలుస్తోంది. కాగా ఢీ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన రియల్ స్టార్ శ్రీహరి 2013లోనే చనిపోతే.. జయప్రకాశ్ రెడ్డి ఈ మధ్యే సెప్టెంబర్ 8న మరణించారు. ఇక వారిద్దరి పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవరమ్ భక్త మంచు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.‘ఢీ’తో సహా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన పలు సినిమాలకు పనిచేసిన రచయిత గోపీమోహన్, మరో పాపులర్ రైటర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్ మహతి మహతి సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇండియాలో నంబర్ వన్ ఫైట్ మాస్టర్‌గా పేరుపొందిన పీటర్ హెయిన్ ‘డి & డి’లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను రూపొందించనున్నారు. ఎం.ఆర్. వర్మ ఎడిటర్‌గా, చిన్నా ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.