AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నిహితుల సమక్షంలో సింగర్ సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్ షో.. అభినందనలు తెలియజేస్తున్న పలువురు అభిమానులు

ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లికి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ తన రెండో పెళ్లి గురించి

సన్నిహితుల సమక్షంలో సింగర్ సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్ షో.. అభినందనలు తెలియజేస్తున్న పలువురు అభిమానులు
uppula Raju
|

Updated on: Dec 27, 2020 | 11:25 AM

Share

ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లికి సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ తన రెండో పెళ్లి గురించి తాజాగా కీలక ప్రకటన చేశారు సునీత. వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. రామ్ చాలా మంచివారని, ఆయనతో తన మిగిలిన జీవితాన్ని పంచుకోబోతున్నానని తెలిపారు. మరోవైపు వచ్చే నెలలో రామ్‌-సునీతల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తేదీని తానే అధికారికంగా ప్రకటిస్తానని సునీత ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు.

ఇదిలా ఉంటే ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా స్నేహితులు, సన్నిహితుల కోసం ఈ జంట ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అలాగే ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందర్నీ ఆకర్షిస్తోంది. పలువురు నెటిజన్లు సునీత-రామ్‌లకు అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల ఈ జంట ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పార్టీలో రేణూదేశాయ్‌, సుమ, పలువురు అతిథులు సందడి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు అప్పట్లో నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!