Tovino Thomas discharged: సినిమా షూటింగ్‌లో గాయపడి గత వారం ఆసుపత్రిలో చేరిన మాలీవుడ్ నటుడు టోవినో థామస్ డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అందరికీ పెద్ద హలో. నేను డిశ్చార్జి అయ్యి ఇంట్లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ, నేను కోలుకోవాలని కోరుకున్న అందరికీ థ్యాంక్స్. వైద్యులు, ఆసుపత్రి స్టాఫ్ నన్ను బాగా చూసుకున్నారు. వారికి థ్యాంక్స్. నా గురించి కేర్ తీసుకున్న సహనటీనటులు, కుటుంబం, స్నేహితులు, సినీ ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. మీ మెసేజ్‌లు, కాల్స్ చూశాక నేను చాలా పాజిటివ్‌గా ఫీలయ్యా. ఈ ఘటన తరువాత ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొని మంచి సినిమాలతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నా. అప్పటివరకు విశ్రాంతి తీసుకొని మీ ప్రేమను ఎంజాయ్ చేస్తా. నాపై ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు తెలిసింది అని పోస్ట్ చేశారు.
ఇక ఆ పోస్ట్‌లో తన పిల్లలు రాసిన వెల్‌కమ్ నోట్‌ని కూడా థామస్ షేర్ చేసుకున్నాడు. ”అందులో ఇంటికి స్వాగతం నాన్నా. మిమ్మల్ని బాగా మిస్ అయ్యాం. త్వరగా కోలుకోండి. ఇజ్జా, తహాన్” అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు మూడు పువ్వుల బొమ్మలు కూడా వేశారు. నెటిజన్లను ఈ పోస్ట్ బాగా ఆకట్టుకుంటుండగా.. త్వరగా కోలుకోండి సర్ కామెంట్లు పెడుతున్నారు.