‘అల్లూరి’గా రామ్ చరణ్.. ‘కొమరం భీం’గా ఎన్టీఆర్

| Edited By:

Mar 14, 2019 | 1:17 PM

క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‌’పై వస్తోన్న అన్ని రూమర్లకు దర్శకధీరుడు రాజమౌళి ఎట్టకేలకు చెక్ పెట్టాడు. ఈ సినిమా కథ, నటీనటుల గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలిపాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ […]

‘అల్లూరి’గా రామ్ చరణ్.. ‘కొమరం భీం’గా ఎన్టీఆర్
Follow us on

క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‌’పై వస్తోన్న అన్ని రూమర్లకు దర్శకధీరుడు రాజమౌళి ఎట్టకేలకు చెక్ పెట్టాడు. ఈ సినిమా కథ, నటీనటుల గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలిపాడు.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ నటించనున్నారని.. వీరితో పాటు అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారని వెల్లడించాడు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’నే మొయిన్ టైటిల్‌గా ఖరారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇక తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో ఈ మూవీ జూలై 30, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య స్పష్టతను ఇచ్చాడు.