Naveen Chandra : విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు కుర్ర హీరో నవీన్ చంద్ర. హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. తారక్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవిందసమేత సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నవీన్ చంద్ర. తాజాగా ఇప్పుడు మరో సినిమాతో ఈ కుర్ర హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నంలు కీలకపాత్రల్లో నటిస్తోన్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. థింక్ బిగ్ బ్యానర్‌పై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్ విజయ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ అధినేత యం. రాజశేఖర్ రెడ్డి, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నంలపై ప్రముఖ నటుడు అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కు ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ– ‘‘ ఈ సినిమా కథ చాలా స్పెషల్. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్‌స్ఫైర్ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ‘‘ కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా నాకు చాలా ఇష్టం. అలాంటి కథతో రాజశేఖర్ నా దగ్గరికి వచ్చారు. కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను’’ అన్నారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండ ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :