Trivikram Dialogues: ఆయన డైలాగ్ రాశాడంటే అది జీవిత సత్యమే.. మాటల మాంత్రికుడి టాప్-10 డైలాగ్స్

|

Jul 07, 2022 | 1:06 PM

తివిక్రమ్ సినిమాలోని కొన్ని డైలాగ్స్ కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఆయా సమయాల్లో మన ముందకు వచ్చి ప్రశ్నిస్తాయి. నువ్వు చేసేది తప్పు కాదా అని నిలదీస్తాయి.

Trivikram Dialogues: ఆయన డైలాగ్ రాశాడంటే అది జీవిత సత్యమే.. మాటల మాంత్రికుడి టాప్-10 డైలాగ్స్
Trivikram
Follow us on

Tollywood: సినిమా అనేది జీవితాలను ప్రభావితం చేస్తుందా లేదా అనేది చాలా పెద్ద చర్చ. దీనిపై చాలామందికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే సినిమాలోని డైలాగ్స్ విషయంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్‌ది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒక్కొక్కరు సూటిగా, ముఖంగా కొట్టినట్లుగా.. స్ట్రైయిట్ ఫార్వెర్డ్‌గా చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్. ఇంకొకరు జీవిత సత్యాలను పురాణాలకు లింక్ పెట్టి.. వాటికి ప్రాసలతో అలంకారాలు అద్దుతారు.. ఉదాహారణకు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). త్రివిక్రమ్ మాటలకే కాదు స్పీచ్‌లకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్పీచ్ మొదలెట్టారంటే.. అప్పటివరకు విజిల్స్ వేసిన కుర్రకారు సైతం నిశ్శబ్ధంగా కూర్చుండిపోతారు. కాగా త్రివిక్రమ్ పెన్ బలం ఎంతో ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మాటలు చాలా ఆలోచింపజేస్తాయి. కుళ్లు జోకులు, బూతు జోకులకు వీలైనంత దూరం పాటించే త్రివిక్రమ్.. జీవితానికి స్పూర్తిని ఇచ్చే ఎన్నో డైలాగ్స్ తన సినిమాల్లో రాశారు. రాస్తున్నారు. అక్కడ స్పేస్ ఉన్నా, లేకున్నా.. ఆయన మాత్రం ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. తన వంతుగా ఎంతోకొంత మందిని మంచి మార్గంలో వెళ్లేలా ఆలోచింపజేస్తారు. అందుకే ఆయన్ను అభిమానులు గురూజీ అంటారు. కాగా తివిక్రమ్ ఇప్పటివరకు రాసిన సినిమాల్లోని టాప్ 10 డైలాగ్స్ చూద్దాం. ఒక్కో సినిమాలో పదల సంఖ్యలో మంచి మాటలు రాసే త్రివిక్రమ్ టాప్ 10 డైలాగ్స్ వెలికితీయడమే అంటే కత్తి మీద సామే. అందునా మేము ఎక్కువగా వన్ లైనర్స్‌పై ఫోకస్ పెట్టాం. ఎక్కువ జనాధారణ పొందనవి మేము ఇక్కడ ఇస్తాం. మీకు నచ్చింది ఏంటో కింద కామెంట్స్‌లో రాయండి. ఎందుకంటే లైఫ్‌ సిట్యూవేషన్స్ బట్టి ఒక్కొక్కరు ఒక్కో డైలాగ్‌కు బాగా కనెక్ట్ అవుతారు.

  1. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. ఓడించడం
  2. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.
  3. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది
  4. అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండడం కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు.
  5. గుడిలో దేవుడిని, కన్న తల్లితండ్రులను మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం
  6. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
  7. మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం
  8. వినే టైమ్, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది
  9. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్
  10. అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు

జీవిత సత్యాలని ఇంత కంటే వాడుక భాషలో బహుశా ఎవరూ చెప్పలేరేమో అన్నట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో వాటిని పెడుతుంటారు. కీప్ గోయింగ్ గురూజీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.