Nayanthara: లేడీ సూపర్ స్టార్‌కు కొత్త కష్టం.. నయన్ ఆఫర్స్ ఆ అమ్మడు తన్నుకుపోతుందా..?

తెలుగు, తమిళ్ భాషలతో పాటు రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టి అదరగొట్టారు నయన్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో నయనతార పేరు బాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది.

Nayanthara: లేడీ సూపర్ స్టార్‌కు కొత్త కష్టం.. నయన్ ఆఫర్స్ ఆ అమ్మడు తన్నుకుపోతుందా..?
Trisha

Updated on: Apr 15, 2024 | 9:46 AM

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న నయనతార రేంజ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. లేడీ సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న నయనతార ఆ ట్యాగ్ ను కాపాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టి అదరగొట్టారు నయన్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో నయనతార పేరు బాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ కు గట్టి పోటీ వచ్చిందని తెలుస్తోంది. ఇంతకు నయన్ కు పోటీ ఇస్తున్న ముద్దుగుమ్మ ఎవరు.? కోలీవుడ్ లో ఏం జరుగుతుంది.

నయన్ తార కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిచింది. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకానొక దశలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. అయితే నయన్ కు గట్టిపోటీ ఇస్తున్న హీరోయిన్ ఎవరో కాదు.. త్రిష. అవును.. నయన్, త్రిష మధ్య పోటీ ఎప్పటినుంచో ఉంది.

ఈ ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. జవాన్ సినిమాతో నయన్ హిట్ అందుకుంటే.. త్రిష పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ అందుకుంది. జవాన్ తర్వాత నటన నటించిన ఇరైవన్‌, అన్నపూరణి సినిమాలు బాక్సాఫిస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో నయన్ కు వచ్చే ఆఫర్స్ ఇప్పుడు త్రిషను పలకరిస్తున్నాయని తెలుస్తోంది. త్రిష ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగులోనూ నటిస్తుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది త్రిష. ఇక నయనతార ఇప్పుడు మాలీవుడ్ పై కూడా దృష్టి పెడుతుంది. మలయాళంలో డియర్‌ స్టూడెంట్‌ అనే సినిమాలో నటిస్తుంది నయన్. ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుంది నయన్.

 నయనతార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.