
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక పెద్ది సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పెద్ది సినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచాయి.
పెద్ది సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్చి 27న చరణ్ పుట్టినరోజున ‘పెద్ది’ రిలీజ్ చేస్తామని మొదట్లో వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆతర్వాత సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ 30న పెద్ది సినిమాను విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. చరణ్ పుట్టిన రోజున ఓ వీడియో టీజర్ ను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే పెద్ది సినిమా మరోసారి వాయిదా పడనుందని టాక్ వినిపిస్తుంది. ఓ మూవీ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘పెద్ది’ కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు నిర్మాత ఎస్కేఎన్. జూన్ 25న ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారట. సినిమా షూటింగ్ పెండింగ్ ఉండటంతో పాటు ఇటీవలే చరణ్ కంటికి గాయం కావడంతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్‌లో ఉందట. ఇదిలా ఉంటే పెద్ది సినిమా తర్వాత రిలీజ్ కోసం చిన్న సినిమాలు రెడీగా ఉన్నాయి. అఖిల్ లెనిన్’ని జూన్ 26కి రావాల్సి ఉంది. ఇప్పుడు పెద్ది దెబ్బకు మే 1కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నిఖిల్ నటిస్తున్న స్వయంభు కూడా పెద్ది తర్వాత రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ సినిమా కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. పెద్ది తర్వాత ఈ సినిమాలన్నీ లైన్ లో ఉన్నాయి.
Producer @SKNonline clarification regarding #Peddi release date which he announced at #ChennaiLoveStory song launch Event #KiranAbbavaram #SKN #Ramcharan pic.twitter.com/uDCbkinMbJ
— Milagro Movies (@MilagroMovies) March 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.