ఓటీటీలోకి సందీప్ కిషన్ మజాకా సినిమా.. అనుకున్నదానికంటే ముందుగానే రానున్న మూవీ.?

మహాశివరాత్రి సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చింది మజాకా సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తెరకెక్కించారు. ఇందులో రావు రమేశ్ కీలకపాత్రలో నటించగా.. రీతూ వర్మ కథానాయికగా కనిపించింది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఓటీటీలోకి సందీప్ కిషన్ మజాకా సినిమా.. అనుకున్నదానికంటే ముందుగానే రానున్న మూవీ.?
Mazaka

Updated on: Mar 04, 2025 | 6:43 PM

హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో సందీప్ కిషన్. ఈ యంగ్ హీరో నటించిన మజాకా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. మజాకా సినిమాలో సందీప్ తో పాటు రావు రమేష్, అన్షు, రీతూ వర్మ నటించి మెప్పించారు. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అన్షు ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‏టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇక విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

మజాకా సినిమా అదిరిపోయిందని.. ముఖ్యంగా కామెడీ వేరేలెవల్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఊరుపేరు భైరవ కోన, రాయన్ సినిమాల తర్వాత సందీప్ ఇప్పుడు మజాకా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  మజాకా సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా మరోసారి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలనీ చాలా మంది ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మజాకా సినిమా ఓటీటీ గురించిన  ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మజాకా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుస్తున్నాయి. తాజాగా అనుకున్న దానికంటే ముందే మజాకా సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మార్చి చివరిలో మజాకా సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని అంటున్నారు. జేఈ  లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్ . త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.