Mahesh Babu: మహేష్ సినిమా కోసం గురూజీ ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా..?

|

Jan 17, 2023 | 5:12 PM

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu: మహేష్ సినిమా కోసం గురూజీ ఆ సీనియర్ హీరోయిన్‌ను రంగంలోకి దింపనున్నారా..?
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఈ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ మహేష్ అన్న, అమ్మ, నాన్న ఇలా వరుసగా స్వర్గస్థులు కావడంతో మహేష్ ఇంట విషాదం నిండింది. దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మహేష్ ఆ బాధనుంచి కోలుకొని షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సినిమాను మహేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ ఉండేలా చూస్తుంటారు త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి

అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అలాగే అజ్ఞాతవాసి సినిమా ఖుష్బూ, ఆలా వైకుంఠపురంలో సినిమాలో టబు లను ఎంపిక చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారట. ఆమె ఎవరో కాదు హీరోయిన్ శోభన, అలనాటి తారల్లో శోభన ఒకరు. హీరోయిన్ గానే కాకుండా శోభన క్లాసికల్ డాన్సర్ గాను ప్రసిద్ధురాలు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహేష్ సినిమా కోసం గురూజీ శోభనను తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది. Shobana