వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్.. యంగ్ బ్యూటీని ఫిక్స్ చేసిన గురూజీ

సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన సినిమా పడాలే గానీ రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హిట్ చూసిన వెంకీ మామ.. తన తర్వాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా దాదాపు ఖరారైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్

వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్.. యంగ్ బ్యూటీని ఫిక్స్ చేసిన గురూజీ
Venkatesh

Updated on: May 31, 2025 | 5:17 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ మూడు సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకంఠాపురంలో సినిమాల్లో ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అలాగే ఎక్కువ సమయం పట్టనుంది. దాంతో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది.  ఆయన ఎవరో కాదు వెంకటేష్. త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు చేశారు.

ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలోనూ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో వెంకటేష్ సరసన గ్లామరస్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈ చిత్రం ఒక కుటుంబ కథాంశంతో రూపొందనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు ఆనంద్ రావు, కుటుంబరావు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరి కామెడీ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం కానుందని, నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.