Jailer: రజినీకాంత్ జైలర్ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?

|

Aug 14, 2023 | 10:10 AM

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది జైలర్. మరోసారి సూపర్ స్టార్  తన నట విశ్వరూపంతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జైలర్ మూవీ తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్ట్ చేసింది. తొలి రోజు దాదాపు 90 కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు 300 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా కంటే ముందు దళపతి విజయ్ తో బీస్ట్ అనే సినిమా  చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్.

Jailer: రజినీకాంత్  జైలర్ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
Jailer
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసిన సూపర్ స్టార్ మేనియా కనిపిస్తుంది. రజినీ కాంత్ నయా మూవీ జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది జైలర్. మరోసారి సూపర్ స్టార్  తన నట విశ్వరూపంతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జైలర్ మూవీ తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్ట్ చేసింది. తొలి రోజు దాదాపు 90 కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు 300 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా కంటే ముందు దళపతి విజయ్ తో బీస్ట్ అనే సినిమా  చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఆహించినట్టుగానే జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మొదటి షో నుంచే జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, జాకీ ష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్ తదితరులు నటించారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారంలోనే జైలర్ మూవీ ఓటీటీలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

జైలర్ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ మూవీని ఫెస్టివల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. తమిళనాట దీపావళి పండుగను గ్రాండ్ గా జరుపుకుంటారు. అయితే దీపావళి కి చాలా సమయం ఉండటంతో.. విజయదశమి కానుకగా జైలర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.