సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ మే 12న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిచారు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ కెరీర్ లో 28 వ సినిమా వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పూజాకార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరపనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యాక్షన్ ఎంటటైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నందమూరి హీరో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది. మహేష్ సినిమాలో విలన్ గా నందమూరి తారకరత్న కనిపించనున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు అని మహేష్ ఫ్యాన్స్ కొందరు అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వార్త పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.