చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో కాంతార సినిమా ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన కాంతారా భాషలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. నటుడు రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన కాంతార సినిమా గత నెల 15న తెలుగులో విడుదల అయ్యింది. అంతకంటే ముందే కన్నడలో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 300కోట్లకు పైగా వాసుల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో రానుందని గత కొద్దిరోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అన్నదాని పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.
ఇటీవల నవంబరు 24న ‘కాంతార’ వచ్చేస్తుందంటూ సోషల్‌మీడియాలోన్ కొని పోస్టర్లు హల్ చల్ చేశాయి. డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో స్వయంగా ప్రకటించినట్లు కొన్ని పోస్టర్స్ ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఇంతవరకు ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే కాంతారా మూవీ స్ట్రీమింగ్ గురించి ‘అమెజాన్ హెల్ప్’ను అడగ్గా నవంబరు 24న అంటూ సమాధానం ఇచ్చింది. అయితే, అధికారిక పేజీలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీకి వస్తుందా.? అన్నది కొంతమంది రేకెత్తుతున్న ప్రశ్న.
అయితే ఈ సినిమాలోని వరాహ రూపం పాటు పై అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.. మలయాళ బ్యాండ్ ‘తెయ్యికుడుం బ్రిడ్జ్’ ‘కాంతార’లోని ఈ పాట పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట, క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన లేకుండా కాంతార సినిమాను ఉహించుకోలేం.. అందుకే అమెజాన్ ఓటీటీ రిలీజ్ పై ఆలోచనలో ఉందని టాక్ వినిపిస్తోంది. సాంగ్ వివాదం ఒక కొలిక్కి రాగానే ఈ మూవీ ఓటీటీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..