Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లోకి మరో బ్యూటీ.. హౌస్‌లోకి ఈ అమ్మడి ఎంట్రీ పక్కా అంటున్నారుగా..!

తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది.

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లోకి మరో బ్యూటీ.. హౌస్‌లోకి ఈ అమ్మడి ఎంట్రీ పక్కా అంటున్నారుగా..!
Bigg Boss 9

Updated on: Jun 14, 2025 | 12:53 PM

దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న గేమ్ షోల్లో బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఒకటి. దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో.. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. నిజానికి బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే.. వీళ్లు వెళ్తున్నారు.. వాళ్ళు వెళ్తున్నారు అంటూ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

అలాగే ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీబీ సీజన్ 9కి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు ఇప్పటికే మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు కొంతమంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. మొన్నటివరకూ అలేఖ్య చిట్టిపికిల్స్ బ్యూటీ రమ్య బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది.

ఆమె ఎవరో కాదు కల్పిక గణేష్.. ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది. సినిమాల్లో సహాయకపాత్రలతో పాపులర్ అయ్యింది కల్పిక గణేష్. సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఈ చిన్నది వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఓ పబ్ లో రచ్చ చేసింది. పబ్ సిబ్బంది తన పై దాడి చేశారు అంటూ వార్తలకెక్కింది కల్పిక గణేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కల్పికా గణేశ్‌ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ కల్పికా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని కొందరు నెటిజన్స్ అంటున్నారు.  మరి ఈ చిన్నది నిజంగా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెడుతుందో లేదో చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్‌) సిస్టర్స్‌, బర్రెలక్క, దెబ్జానీ, శివకుమార్‌, ఇమ్మాన్యుయేల్‌ ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి