రానా దగ్గుబాటి ఏమయ్యారు..? కొన్ని నెలలుగా ఎందుకు సినిమాలు చేయడం లేదు.. కొన్నేళ్లుగా కథలు ఎందుకు వినడం లేదు..? కేవలం హెల్త్ ఇష్యూసే కారణమా..? లేదంటే ఇతర కారణమేమైనా ఉందా..? విరాట పర్వం తర్వాత సినిమాలే సైన్ చేయలేదు దగ్గుబాటి వారసుడు. పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్నా.. ప్రాజెక్ట్స్ ఎందుకు ఒప్పుకోవడం లేదు..? ఈ గ్యాప్ ఇంకెన్నాళ్ళు ఉండబోతుంది..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లీడర్‌తో కెరీర్ మొదలుపెట్టిన రానా దగ్గుబాటి.. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా చేసారీయన. కేవలం హీరోగానే కాకుండా.. కారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీ అయ్యారు రానా. బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. దానికి ముందే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు రానా. కానీ ఈ మధ్య దగ్గుబాటి హీరోలో మునపటి జోష్ కనిపించట్లేదు.
బాహుబలి 2, నేనేరాజు నేనేమంత్రి వరకు బాగానే సాగిన రానా జర్నీ.. ఆ తర్వాత కాస్త తడబడింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబుగా ఆకట్టుకున్న రానా.. నాలుగేళ్లుగా హీరోగా సినిమాలే చేయడం లేదు. హౌజ్ ఫుల్ 4లో చిన్న పాత్ర.. అరణ్య, 1945 ఎన్నో వాయిదాల తర్వాత వచ్చాయి. ఇక విరాట పర్వం కూడా కరోనాకు ముందు సైన్ చేసిన సినిమా. కేవలం భీమ్లా నాయక్ మాత్రమే ఈ మధ్య కాలంలో రానా పూర్తి చేసారు.
ఆ మధ్య అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు రానా. అప్పట్నుంచే సినిమాలు సంఖ్య తగ్గించేసారు. విరాట పర్వం తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు ఈయన. ఇంకా చెప్పాలంటే రెండేళ్లుగా కథలే సరిగ్గా వినట్లేదు. వెంకటేష్‌తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు రానా. మరి మళ్లీ దగ్గుబాటి వారసుడిలో మునపటి జోష్ ఎప్పటికి కనిపిస్తుందో చూడాలిక.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.