Salaar Movie : ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్ కలర్‌లో ఉంటాయో తెలుసా..?

'సలార్'  సినిమాకు కేజీఎఫ్ సినిమాకు సంబంధం ఉందంటూ ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల థీమ్ కూడా ఒకేలా ఉండటం.. అదే డార్క్ నెస్ రెండు సినిమాల్లో ఉండటంతో 'కేజీఎఫ్ 2'కి 'సలార్‌'కి లింక్‌ ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రతిసారీ ఇలాంటి డార్క్ షెడ్ ను ఎంచుకోవడానికి కారణం ఉందట. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Salaar Movie : ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్ కలర్‌లో ఉంటాయో తెలుసా..?
Prashanth Neel

Updated on: Dec 19, 2023 | 9:44 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 1,2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘సలార్’  సినిమాకు కేజీఎఫ్ సినిమాకు సంబంధం ఉందంటూ ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల థీమ్ కూడా ఒకేలా ఉండటం.. అదే డార్క్ నెస్ రెండు సినిమాల్లో ఉండటంతో ‘కేజీఎఫ్ 2’కి ‘సలార్‌’కి లింక్‌ ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రతిసారీ ఇలాంటి డార్క్ షెడ్ ను ఎంచుకోవడానికి కారణం ఉందట. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ప్రశాంత్ ఏం చెప్పాడంటే..

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాల కలర్ టోన్ గురించి ప్రేక్షకుల తెగ మాట్లాడుకుంటున్నారు. అతని సినిమాలు డార్క్ షేడ్‌లో మాత్రమే ఉంటాయి. ‘కేజీఎఫ్ 2’ సినిమా పూర్తిగా డార్క్ షేడ్‌లో ఉంది. ఈ సినిమా సెట్ మోడల్, కలరింగ్ టోన్ కూడా ‘సలార్’లో వాడారు. అదే కలరింగ్ టోన్ వల్ల ‘కేజీఎఫ్ 2’కి ‘సలార్’కి లింక్ ఉందా అనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతోంది.

ప్రశాంత్ నీల్‌కి ఓసిడి ఉందట! అందుకోసం ఒకే తరహా సినిమా తీస్తున్నారు. ‘‘కేజీఎఫ్‌, సలార్‌లు ఒకేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు OCD ఉంది. రంగురంగుల చొక్కాలు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నా మనసులో ఏముందో తెరపై అదే కనిపిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు’ అని ప్రశాంత్ నీల్ అన్నారు. OCD అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడేవారికి కొన్ని వ్యామోహాలు ఉంటాయి. దానివల్ల వారు ఒకే రకమైన పనులు, ఒకే రకమైన పద్దతి ఫాలో అవుతూవుంటారు.

ఇక కేజీఎఫ్ 2’ సినిమా కంటే ముందే ‘సలార్’ సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్ 2’ సినిమా ప్రభావం ‘సలార్’ సినిమాపై లేదని ప్రశాంత్ నీల్ గతంలోనే స్పష్టం చేశారు. డిసెంబర్ 22న ‘సాలార్’ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్ తదితరులు నటించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రన్ని నిర్మిస్తుంది. రవి బస్రూర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..