
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లోని కీలక ఘట్టాలను, వ్యక్తిగత అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనను ‘ట్రెండ్ సెట్టర్’ అనడం కంటే ‘ట్రెండ్ ఫాలోవర్’ అని పిలుచుకోవడానికే ఆయన ఇష్టపడతానని తెలిపారు. తాను చేసిన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడం, వారంతా నేడు ఉన్నత స్థితిలో ఉండటం తనకు ఎంతో తృప్తిని ఇస్తుందని వినాయక్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా నేపథ్యం గురించి మాట్లాడుతూ.. తాను ఒక సినిమా థియేటర్ యజమాని కొడుకుగా పుట్టానని, సినిమానే తన సర్వస్వం అని పేర్కొన్నారు.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
కెరీర్ ప్రారంభంలో రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఇబ్బందులు పడ్డప్పటికీ, స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా నిరంతరం పని చేస్తూనే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఏమీ లేని వాడికి రిస్క్ ఉండదని, కష్టపడితే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడిగా తన మొదటి అవకాశం చాలా సులువుగా వచ్చిందని వినాయక్ తెలిపారు. ఎవరి చుట్టూ తిరగకుండానే, తాను చెప్పిన ఒక కథ నచ్చి నిర్మాతలు సురేష్, బుజ్జిలు వెంటనే సినిమా చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇక తన మొదటి చిత్రం ‘ఆది’ విజయంపై మాట్లాడుతూ.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అది బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం తమకు ఉండేదని వెల్లడించారు. విశేషమేమిటంటే, ‘ఆది’ సినిమా విడుదలైన వారం రోజులకే తన వివాహం జరిగిందని వినాయక్ ఒక మరుపురాని జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?