Shine Tom Chacko: డ్రగ్స్ మత్తులో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన దసరా విలన్..

మలయాళీ నటి విన్సీ సోనీ అలోషియస్.. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమ సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతడి పేరు వెల్లడించలేదు. ఈ క్రమంలో మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు షైన్‌ టామ్‌ చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.

Shine Tom Chacko: డ్రగ్స్ మత్తులో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన దసరా విలన్..
Vincy Aloshious, Shine Tom

Updated on: Apr 17, 2025 | 1:38 PM

మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు షైన్‌ టామ్‌ చాకో. టాలీవుడ్‌లోకి నాని దసరా చిత్రంతో అడుగుపెట్టాడు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత షైన్ టామ్ చాకో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు డ్రగ్స్ తీసుకునే వారితో నటించనని విన్సీ అలోషియస్ ఇటీవల చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీని తర్వాత నటిపై సైబర్ దాడి కూడా జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఇప్పుడు ఆమే షైన్‌ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్య ప్రవర్తించడని ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మరోసారి విన్సీ వీడియో వైరల్‌గా మారింది.

విన్సీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇంతకు ముందే చెప్పారు. మాదకద్రవ్యాల వాడకానికి సంబంధించిన ఆరోపణల కారణంగా ఎక్సైజ్ కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాగా ఓ వీడియోలో సుత్రవాక్యం అనే సెట్ లో తనతో షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది విన్సీ. సినిమా షూటింగ్ సమయంలో అతను డ్రగ్స్ వాడుతున్నాడు. ఆ విషయం సెట్‌లో అందరికీ తెలుసు. అంతగా తెలియని వ్యక్తితో నటించడం, అతనితో కలిసి పనిచేయడం తనకు ఆసక్తి లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విన్సీ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..