Leo Movie: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న విజయ్ దళపతి.. ‘లియో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

అంతకు ముందే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో విడుదలకు ముందే బుకింగ్స్ లో ఈ సినిమా హావా కొనసాగింది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ దళపతి ఫ్యాన్స్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అటు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ విజయ్ అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రెండు రోజులు ఈ సినిమా కలెక్షన్స్ అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత దసరా వరుస సెలవులు కావడంతో ఈ మూవీ కలెక్షన్స్

Leo Movie: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న విజయ్ దళపతి.. లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Leo Movie

Updated on: Oct 25, 2023 | 10:41 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న చిత్రాల్లో లియో ఒకటి. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మాస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. అంతకు ముందే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో విడుదలకు ముందే బుకింగ్స్ లో ఈ సినిమా హావా కొనసాగింది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ దళపతి ఫ్యాన్స్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అటు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ విజయ్ అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రెండు రోజులు ఈ సినిమా కలెక్షన్స్ అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత దసరా వరుస సెలవులు కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.

విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. విడుదలైన నెలరోజుల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల అంటే నవంబర్ 21న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక కథ విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్ లో తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తూ కాఫీ షాప్ నడుపుతుంటాడు పార్తిబన్ (విజయ్). ఒకసారి ఆ షాపుకు వచ్చిన కొందు రౌడీలు తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో పార్తిబన్ వాళ్లను చంపేస్తాడు. ఆ తర్వాత ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ వద్దకు వచ్చి.. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అంటూ చెప్తాడు. ఇంతకీ లియో ఎవరు ?పార్తిబన్ ఎవరు? వీళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటనేది సినిమా. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.