Ram Charan: రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి.. మరోసారి బుచ్చిబాబు డైరెక్షన్‏లో మక్కల్ సెల్వన్..

|

Jul 09, 2023 | 8:19 AM

డైరెక్టర్ బుబ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్స్ కూడా ఇదివరకే కంప్లీట్ అయ్యాయి. ఇక కేవలం అధికారికంగా లాంచ్ చేయాల్సి ఉంది. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ మొత్తానికి చరణ్ నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం.

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి.. మరోసారి బుచ్చిబాబు డైరెక్షన్‏లో మక్కల్ సెల్వన్..
Ram Charan, Vijay Sethupath
Follow us on

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ నుంచి కొద్ది రోజులు చరణ్ బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోపాటు.. చరణ్ మరో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్ బుబ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్స్ కూడా ఇదివరకే కంప్లీట్ అయ్యాయి. ఇక కేవలం అధికారికంగా లాంచ్ చేయాల్సి ఉంది. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ మొత్తానికి చరణ్ నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఒక పాత్ర పై మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ ఉందట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ పాత్రను హైలెట్ చేయబోతున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. రామ్ చరణ్ పాత్ర అత్యంత కీలకంగా ఉండనుండగా.. మరో పవర్ ఫుల్ పాత్ర కోసం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే సేతుపతిని సంప్రదించారని సమాచారం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో విజయ్ పాత్ర మరింత డిఫరెంట్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో విజయ్ రోల్ విలన్ గా కాదు.. కథను మలుపుతిప్పే పాత్ర అని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక ఆ పాత్రతోనే సినిమాలో అసలైన ఎమోషన్ హైలెట్ అవుతుందని.. విజయ్ సేతుపతికి తగిన రోల్ కావడంతో.. ఆయనను సంప్రదించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరీ రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.