Kaathuvaakula Rendu Kaadhal: తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సేతుపతి నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’. ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు గా నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ, 7 స్ర్కీన్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో కణ్మణి రాంబో ఖతిజా పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి అవస్థలు పడే వ్యక్తిగా సేతుపతి కనిపించారు. ఈ సినిమాలో రాంబోగా విజయ్ సేతుపతి, కన్మణిగా నయనతార, ఖతీజా గా సమంత కనిపించనున్నారు. తొలుత ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలేనని, తమ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుంది చిత్రబృందం తెలిపింది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి
మరిన్ని ఇక్కడ చదవండి :