
మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్(Liger). డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ పెంచేశాయి. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఆగస్ట్ 25న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే నార్త్, సౌత్ ప్రధాన నగరాల్లో లైగర్ ఫ్యాన్డమ్ ఈవెంట్స్ నిర్వహించి అభిమానులకు దగ్గరయ్యారు లైగర్ చిత్రయూనిట్. ఇక తాజాగా లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది టీం.
ఆగస్ట్ 20న సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ పవర్ ఫుల్ లుక్ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
ట్వీట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.