Liger Movie: ప్రమోషన్లలో కొత్తపుంతలు తొక్కుతున్న లైగర్ చిత్రయూనిట్.. ఏకంగా ఆకాశంలోనే..

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించనున్నారు.

Liger Movie: ప్రమోషన్లలో కొత్తపుంతలు తొక్కుతున్న లైగర్ చిత్రయూనిట్.. ఏకంగా ఆకాశంలోనే..
Liger

Updated on: Aug 09, 2022 | 3:47 PM

లైగర్ (Liger) ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు చిత్రయూనిట్ సరికొత్త ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ మూవీ టీం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై, పాట్నా, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే వీధుల్లో సామాన్య ప్రజలకు చేరువయ్యారు. తాజాగా విజయ్, అనన్య విమానంలోని ఎకానామీ క్లాస్‏లో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాత ఛార్మీ తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

ప్రజలతో లైగర్ హీరో విజయ్ దేవరకొండ. మీలాంటి వారు ఎవరు లేరు. రాకింగ్ బ్యూటీ అనన్య పాండే. మా అందరిపై సినీ ప్రేమికుల ప్రశంసలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. లైగర్ టీం వడోదరలో ప్రమోషన్స్ లో పాల్గొంది. ఇటీవల వడోదరలో జరిగిన ఈవెంట్ లో అనన్య బెలూన్స్  గాల్లోకి ఎగురవేసేందుకు విజయ్ సాయం చేశారు.  బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహర్, పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.