అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా ఎమోషనల్ కామెంట్స్

సినీ పరిశ్రమలో తల్లిగా.. అక్కగా.. భార్యగా.. అత్తగా ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించింది సీనియర్ నటి సుధ. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 900లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఆమె. దాదాపు అందరూ స్టార్ హీరోస్ సినిమాల్లో కీలకపాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా ఎమోషనల్ కామెంట్స్
Tollywood Actress Sudha

Updated on: Dec 30, 2025 | 12:57 PM

కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో సుధా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుధా. అమ్మ పాత్రలకు సుధా పెట్టింది పేరు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుధా. హీరో, హీరోయిన్ అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుధా. ఇప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దూకుపోతున్నారు సుధా. కాగా గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వృత్తిపరమైన సవాళ్లను, అనుభవాలను పాసింగ్ క్లౌడ్స్ అని అన్నారు, వాటిని జీవిత పాఠాలుగా స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు సుధా. ఎదుటివారి ఈర్ష్య వల్ల వారికే నష్టం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

సుధా ఇండస్ట్రీలో తన స్నేహితుల గురించి మాట్లాడుతూ.. బెంగళూరు పద్మ, చంద్రమోహన్, జలంధర  వంటి వారితో తనకున్న సన్నిహిత బంధం ఉంది అని అన్నారు. పని చేసే ప్రదేశంలో తోటి కళాకారులనే తన కుటుంబంగా భావిస్తానని, వారి ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఆలోచిస్తానని చెప్పారు. తన తల్లి తనకు ఇచ్చిన గొప్ప జీవిత పాఠాన్ని గుర్తుచేసుకుంటూ, డబ్బు కంటే మనుషులను సంపాదించుకోవడమే నిజమైన సంపదని అన్నారు సుధా. బంధుత్వాలు రక్త సంబంధాలకే పరిమితం కాదని, ఆపదలో ఆదుకునేవారే నిజమైన బంధువులని తన తల్లి మాటలను గుర్తుచేసుకున్నారు.

అదేవిధంగా దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలన్న తన కోరిక వెనుక ఉన్న కారణాలను సుధా వివరించారు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉదయ్ కిరణ్ ఒంటరితనం ఆమెను కదిలించిందని అన్నారు. అనాథగా, ఒక రకంగా సముద్రం నడిమధ్యలో ఉన్నట్లు అనిపించిన ఉదయ్ కిరణ్‌ను చూసినప్పుడు దేవుడు తనకిచ్చిన బిడ్డగా అనిపించిందని ఆమె అన్నారు. 45 సంవత్సరాలు దాటిన తర్వాత దత్తత తీసుకోవచ్చన్న నిబంధనల ప్రకారం, న్యాయపరంగా అన్ని పత్రాలను సిద్ధం చేసి, కోర్టు ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ తనను దూరం చేసుకున్నాడని సుధా ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్, తన కుమార్తె ఫోన్, అలాగే తన హెయిర్ స్టైలిస్ట్ ఫోన్ కూడా ఎత్తడం మానేశాడని తెలిపారు. ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి తనకు తెలియదని, ఆ పెళ్లికి తాను వెళ్లలేదని సుధా చెప్పారు, ఆ అమ్మాయి అతడికి సరిపోకపోవచ్చని అనిపించిందని అన్నారు. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉంటే తనకు ఒక బలమైన తోడు ఉండేదని, అతని అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు. చలపతిరావు గారు, తాను ఉన్న షూటింగ్‌లో ఉదయ్ కిరణ్ తన కాళ్లపై పడి ఏడ్చాడని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని సుధా కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.