AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేష్ కన్నుమూత

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ (70) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం చెన్నైలో జరగనున్నాయి. 1971లో గిటారిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేశ్, ఆ తర్వాత సంగీత దర్శకుడిగా ఎదిగారు. మలయాళం, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో 250కు పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన, ఫిల్మ్ ఫేర్, కేరళ స్టేట్ అవార్డులను ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకున్నారు.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేష్ కన్నుమూత
Sp Venkatesh Passed Away
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 2:06 PM

Share

సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేష్ కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి సినిమా ఇండస్ట్రీలో విషాదంలో మునిగిపోయింది. తెలుగు, మలయాళం, తమిళ్ , హిందీ , బెంగాలీ భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించారు వెంకటేష్. అంతే కాదు అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎస్పీ వెంకటేష్ మంగళవారం నాడు 70 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. చెన్నైలోని తన నివాసంలో ఎస్పీ వెంకటేష్ కన్నుమూశారు.

రేపు చెన్నైలో ఎస్పీ వెంకటేష్ అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది. గిటారిస్టుగా తన సినీ ప్రస్థాన్ని మొదలు పెట్టిన వెంకటేష్.. ఆతర్వాత సంగీత దర్శకుడిగా మారారు. 1975లో కన్నడ చిత్రాలలో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశారు. 1981లో తెలుగు చిత్రమైన ప్రేమ యుద్ధం తో సంగీత దర్శకుడిగా తొలి సినిమా చేశారు. ఈ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ ఎక్కువగా మలయాళ భాషల్లో సినిమాలు చేసి మెప్పించారు. రాజావింటే మకన్, అప్పు, దౌత్యం, విలంబరం , మహాయనం, వ్యూహం ఇలా ఎన్నో చిత్రాలు అద్భుతమైన సంగీతం అందించారు. ఎస్పీ వెంకటేష్ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..