Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

|

Aug 17, 2024 | 8:33 AM

సమంత నాగ చైతన్య విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. మొదట్లో ఆయన మాటను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే సమంత, నాగ చైతన్య విడిపోయారు. దాంతో ఒక్కసారిగా వేణు స్వామి పేరు మారుమ్రోగింది. అసలు ఎవరు ఈ వేణు స్వామి అంటూ చాలా మంది ఆయన గురించి గాలించారు. ఆ తర్వాత చాలా మంది సినీ సెలబ్రెటీలకు జాతకాలు చెప్పారు ఈ పాపులర్ జ్యోతిష్కుడు.

Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి
Venu Swamy
Follow us on

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా వల్ల కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్తూ క్రేజ్ తెచ్చుకున్నారు వేణు స్వామి. సమంత నాగ చైతన్య విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. మొదట్లో ఆయన మాటను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే సమంత, నాగ చైతన్య విడిపోయారు. దాంతో ఒక్కసారిగా వేణు స్వామి పేరు మారుమ్రోగింది. అసలు ఎవరు ఈ వేణు స్వామి అంటూ చాలా మంది ఆయన గురించి గాలించారు. ఆ తర్వాత చాలా మంది సినీ సెలబ్రెటీలకు జాతకాలు చెప్పారు ఈ పాపులర్ జ్యోతిష్కుడు. సమంత, నాగ చైతన్య విడిపోయిన తర్వాత వేణు స్వామి చాలా మంది సెలబ్రెటీలు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఇక హీరోయిన్స్ కూడా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన్ లాంటి హీరోయిన్స్ దగ్గర నుంచి టీవీ యాక్ట్రెస్ వరకు చాల మంది ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలు బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీరాజకీయాల్లో వేణు స్వామి చెప్పిన జాతకం రివర్స్ అయ్యింది. దాంతో ఆయన ఇకపై రాజకీయ నాయకుల జాతకాలు చెప్పను అని నిర్ణయించుకున్నారు.

అయితే రీసెంట్ గా నాగ చైతన్య శోభిత దూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. అయితే శోభిత దూళిపాళ్ల, నాగ చైతన్య కూడా విడిపోతారు అని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. దాంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ దెబ్బకు వేణు స్వామి ఇక పై సినిమా వాళ్ల జాతకం చెప్పను అని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితము పై కూడా వేణు స్వామి కామెంట్స్ చేశారు. రకుల్ కు పెళ్లి తర్వాత కలిసి రాదు అని అన్నారు. ఆయన భర్త అప్పుల్లో కురుకుపోతాడు అని చెప్పారు అలాగే రకుల్  ఆమె భర్త కూడా విడిపోతారు అని కామెంట్స్ చేశారు వేణు స్వామి. రకుల్ కు ఎంగేజ్ మెంట్ అయినప్పుడే ఆమె వాళ్లు విడిపోతారని చెప్పను అని అన్నారు వేణు స్వామి.  ఇప్పుడు మరోసారి వేణు స్వామి చేసిన ఈ ఓల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..