
విక్టరీ వెంకటేశ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో జనాలను ఆకట్టుకున్నారు వెంకీ. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. వెంకీ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ లక్ష్మి. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో 2006లో విడుదలై ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయనతార, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారం అందుకున్నారు. ఇందులో శకుంతల, వేణు మాధవ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక ఇందులో వెంకీకి ఇద్దరు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉంటారు. తమ్ముళ్లను సరైన దారిలో నడిపించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు వెంకీ.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
ఇక ఇందులో వెంకీ పెద్ద చెల్లెలుగా నటించిన నటి గుర్తుందా.. ? ఈ మూవీలో ఆమె పాత్ర కీలకమనే చెప్పాలి. ఆమె పేరు ఉమాశంకరి. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు కానీ.. వెంకీ పెద్ద చెల్లెలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. దక్షిణాది పాపులర్ నటి సుమిత్ర కుమార్తె ఆమె. సుమిత్ర తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషలలో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. సుమిత్ర, కన్నడ దర్శకుడు డి. రాజేంద్ర బాబును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉమాశంకరి, నక్షత్ర అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఉమాశంకరి సౌత్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లక్ష్మీ సినిమాతో పాపులర్ అయిన ఉమాశంకరి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా తాను రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఉమాశంకరి. తాజాగా తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తన ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఆమె ప్రస్తుతం రెండవ దశ కీమోథెరపీ , ఇమ్యునోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా చాలా సవాలుగా గడుస్తున్నాయని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయినప్పటికీ తాను ఈ పోరాటాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటున్నానని… వైద్యుల చికిత్సతో పాటు, తన కుటుంబ మద్దతు, తన అభిమానుల ప్రేమ కొత్త శక్తిని ఇస్తున్నాయని.. త్వరలోనే పూర్తిగా కోలుకుని ఆరోగ్యకరమైన జీవితానికి తిరిగి వస్తానని ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చూసి త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..