
సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నయా మూవీ సైందవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైందవ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు శైలేష్. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ నటిస్తున్న 75 వ సినిమా ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. శైలేష్ గతంలో తెరకెక్కించిన హిట్ 1,2 మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా సైందవ్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు . ఈ ట్రైలర్ ను యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. వెంకటేష్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టేశాడు. విజువల్స్ కూడా చాల రిచ్ గా కనిపిస్తున్నాయి. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కూడా మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.
ఇక ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియాలకి కూడా మంచి రోల్స్ ప్లే చేస్తున్నారు. సైందవ్ సినిమాను జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే ఈ ట్రైలర్ లో సంతోష్ నారాయణన్ మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత అగ్రెసివ్ వెంకీ ని మనం ఈ సినిమాలో చూడొచ్చు.
#Saindhav‘s final mission begins 🙂#SaindhavTrailer out now!
See you at the cinemas from Jan 13th! pic.twitter.com/YuP9Emv3WR
— Venkatesh Daggubati (@VenkyMama) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..